|
|
రాష్ట్రంలో 11 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్ర డీజీపీగా ఎంపికైన ఎస్.ఎస్.పి.యాదవ్ స్థానంలో గిరీష్ కుమార్ ను నియమించారు. ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ డైరక్టర్ జనరల్ గా పనిచేస్తూ ఉన్న ఆయనను కొత్త డీజీపీగా ప్రభుత్వం మంగళవారం రాత్రి నియమించింది. యాదవ్ తో పాటు మరి కొందరు ఉన్నతాధికారులకు ప్రభుత్వం స్థానచలనం కలిగించింది. ఇప్పటివరకు యాదవ్ వహించిన అవినీతి నిరోధక శాఖ డైరక్టర్ జనరల్ పదవిలో ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ జనరల్ గిరీష్ కుమార్‌ను నియమించారు. ఆయన స్థానంలో జైళ్ల విభాగం డీజీ జయచంద్రను నియమించిన ప్రభుత్వం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఛైర్మన్ పదవిలో ఉన్న గౌతమ్ కుమార్‌ను జైళ్ల విభాగం కొత్త డీజీగా నియమించగా, అగ్నిమాపక సేవల విభాగం డీజీగా అరుణా బహుగుణను నియమించారు.
|
|