'కరుణ' కు కొర్టు నోటిసు
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం
అన్నాడీఎంకే వేసిన కోర్టు ధిక్కార పిటిషన్ పై సుప్రీంకోర్టు తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి సోమవారం సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అక్టోబరు 1న డీఎంకే తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్ కు తమిళనాడు ప్రభుత్వం సహకరించకూడదని సుప్రీంకోర్టు సెప్టెంబరు 30న ఆదేశాలు ఇంతకు ముందే ఇచ్చింది. అయితే ఆ ఆదేశాలను రాష్ట్ర పాలనా యంత్రాంగం పట్టించుకోకపోవడం తో కోర్టు ఆదేశాలను ధిక్కరించిందని పేర్కొంటూ అన్నాడీఎంకే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై కోర్టు ప్రతివాదులకు నోటీసులు పంపింది.