అమెరికా,భారత్ అణు ఒప్పందం సమర్ధనీయమే:కకోడ్కర్
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

 అమెరికాతో భారత్ కుదుర్చుకున్న చారిత్రత్మక పౌర అణు ఒప్పందాన్ని జాతీయ అణు శక్తి సంస్థ ఛైర్మన్ అనీల్ కకోడ్కర్ సమర్థించారు. పెరుగుతున్న ఇంధన అవసరాలకు అణు శక్తి చాలా అవసరమన్నారు.దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు తీర్చేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. అమెరికాతో పౌర అణు సహకారం భారత్‌కు లాభిస్తుందని ఆయన ఆదివారం విలేకరులకు చెప్పారు. దేశీయ వ్యూహాత్మక అణు కార్యక్రమానికి ఆటంకాలు కలగకుండా ఈ అణు ఒప్పందాన్ని అమల్లోకి తేవాలని కకోడ్కర్ అన్నారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.