ఆపరేషన్ సక్సస్ బట్ ఎక్సరే లో లాకెట్
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

 ఢిల్లీలోని ఎల్.ఎన్.జేపీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ సమయం లో లాకెట్ లోపల పెట్టి కుట్టేశారు. సురేందర్ కుమార్ ఝా అనే వ్యక్తి తన తొమ్మిది నెలల బాబు ఉదయ్ ని ఊపిరితిత్తుల సమస్య కు చికిత్స కోసం ఇక్కడి ఎల్.ఎన్.జేపీ ఆసుపత్రిలో చేర్చారు. ఊపిరితిత్తుల్లో చేరిన నీరు తీసేయడానికి ఆపరేషన్ అవసరమని వైద్యులు చెప్పి, శస్త్రచికిత్స చేశారు. అయితే అప్పట్నుంచి బాబు ఆపులేకుండా ఏడుపు మొదలుపెట్టాడు.ఎక్స్ రే తీయించి చూస్తే లాకెట్ ఉండడం చూసి తల్లిదండ్రులు ఆందోళన కు గురైయ్యారు.ఆపరేషన్ చేసినప్పుడు బాబు మెడలో ఉన్న లాకెట్ ఎక్స్ రేలో స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. వైద్యులు నిర్లక్షంగా వ్యవహరించి ఉదయ్ కడుపులో లాకెట్ వేసి కుట్టేశారని ఉదయ్ తలిదండ్రులు ఆరోపిస్తున్నారు.మరోవైపు ఆసుపత్రి వర్గాలు తల్లిదండ్రుల వాదనను తోసిపుచ్చాయి.అంతపెద్దసైజు ఉన్న లాకెట్ శస్త్రచికిత్స కోసం చేసిన చిన్న రంద్రం ద్వారా లోపలికి వెళ్లడం ఎలా సాధ్యమని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఎక్స్ రేలో బయటి వస్తువు ఏదో పొరపాటున వచ్చి ఉంటుందని ఆసుపత్రి వైద్యుడు, ప్రొఫెసర్ జి.ఆర్.సేథి అన్నారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.