ఖమ్మంలో నలుగురు నక్సలైట్లు మృతి
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

ఖమ్మం, అక్టోబర్‌ 19 : ఖమ్మం జిల్లా పాల్వంచ మండలంలోమొ కిన్నెరసాని వాగు వద్ద తెల్ల్వారుజామున పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన కాల్పులలో నలుగురు నక్సలైట్లు మృతి చెందారు. గురువారం ఉదయం వివిధ నక్సలైట్‌ గ్రూపులకు చెందిన పదిమంది జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోవడంతో లభించిన సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా శుక్రవారం ఒంటిగంట సమయంలో గుట్టమళ్ళ సమీపంలో తారసపడిన నక్సలైట్లపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు వారు తెలిపారు. సంఘటనా స్థాలం నుండి పోలీసులు కిట్‌బ్యాగులు, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మృతిచెందిన వారిని జనశక్తి గ్రూప్‌ కు చెందిన నక్సలైట్లుగా భావిస్తున్నారు. మావోయిస్టులు క్యాంపు ఏర్పాటు చేసుకున్నారనే సమాచారం మేరకు స్పెషల్‌ కూంబింగ్‌ టీం అటవీ ప్రాంతాలలో ముమ్మరంగా కూంబింగ్‌ నిర్వహిస్తోంది.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.