|
|
 |
ఆపరేషన్ కళంక్' సృష్టించిన వివాదానికి ఆజ్యం పోస్తున్న రీతిలో ఆజ్ తక్, సీఎన్ఎన్ ఐబీఎన్, ఐబీఎన్-7 టీవీ వార్తా ఛానళ్లను గుజరాత్ ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు పైన పేర్కొన్న టీవీ ఛానళ్ళలో ఆపరేషన్ కళంక్ తాలూకూ వీడియో దృశ్యాలు ప్రసారమైన గురువారం నాడే నిషేధిత ఉత్తర్వులను జారీ చేసినట్టు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో గుజరాత్ రాజకీయ పరిణామాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా.. ఇటీవల హిందూస్థాన్ టైమ్స్ ఢిల్లీ సదస్సులో గోద్రా సంఘటనపై పాత్రికేయుల ప్రశ్నలకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అసహనం ప్రకటించడం, అలాగే.. అదే అంశంపై ఒక టీవీ ఛానల్ నిర్వహిస్తున్న ఇంటర్వ్యూను మోడీ అర్థాంతరంగా వదిలివేసి వెళ్లిపోవడం ఎన్నికల వాతావరణంలో వేడిని రగిలించింది. ఈ నేపథ్యంలో టీవీ ఛానళ్ళపై గుజరాత్ ప్రభుత్వ నిషేధం తీవ్ర సంచలనం సృష్టించనుంది.
|
|