|
|
 |
తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావుపై సినీ నటి, తెలుగుదేశం మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సదస్సు గందరగోళంగా మారింది. ఈ సదస్సులో పాల్గొన్న రోజా ప్రసంగిస్తూ.. భారతీయ జనతా పార్టీ, లోక్‌సత్తా, కేసీఆర్‌లపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ముఖ్యంగా చంద్రశేఖర రావుపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. కేసీఆర్‌కు రాత్రి పూట బార్.. పగటి పూట దర్బార్ కావాలని అన్నారు. దీంతో.. సదస్సులో పాల్గొన్న తెరాస ఎమ్మెల్యే నాయిని నర్సింహా రెడ్డితో పాటు.. ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నటి చేసిన వ్యాఖ్యలు తక్షణం ఉపసంహరించుకుని, క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అయితే.. నటి రోజా మాత్రం క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు.
|
|