|
|
గుజరాత్ లో 2002 వ సంవత్సరం లో జరిగిన గోద్రా అల్లర్ల తరువాత జరిగిన ఎరోల్ సజీవ దహనం కేసులో మంగళవారం గోద్రా సెషన్స్ కోర్టు మొత్తం 11 మందిని దోషులుగా నిర్ధారించి శిక్షలు ఖరారు చేసింది. వీరిలో ఎనిమిది మందికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించగా, మిగిలిన ముగ్గురు దోషులకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో మరో 27 మంది నిందితులను కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి హెచ్ఎం ధోలాకియా మొత్తం 8 మంది దోషులుకు యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేస్తూ తీర్పు చెప్పారు. ఇద్దరు మైనర్ బాలికలను గ్యాంగ్ రేపు చేసిన నేరంలో కూడా ఈ ఎనిమిది మందిలో ముగ్గురు దోషులుగా నిర్ధారించబడ్డారు.
|
|