|
|
 |
రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ మంగళవారం క్రికెట్, పుట్‌బాల్, హాకీలకు చెందిన క్రీడాకారులను ఒకే వేదికపై సన్మానించనున్నారు. ట్వంటీ 20 ప్రపంచకప్ గెలిచిన క్రికెట్ జట్టు, ఆసియాకప్ సాధించిన హాకీ క్రీడాకారులు, నెహ్రూ కప్ సొంతంచేసుకున్న పుట్ బాల్ ఆటగాళ్లు ఈ సన్మాన గౌరవాన్ని స్వీకరించనున్నారు. క్రికెట్ తో సమానంగా అన్ని రకాల క్రీడలకు ఆదరణ లభించాలన్నదే ఈ సన్మానం ముఖ్యోద్ధేశంగా రాష్ట్రపతి కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. మూడు రంగాలకు చెందిన క్రీడాకారులను ఒకేసారి సన్మానించేందుకే ఈ సన్మాన కార్యక్రమాన్ని ఆలస్యంగా నిర్వహిస్తున్నామని ఆ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి దృష్ఠిలోనైనా క్రికెట్ క్రీడతో సమానంగా మిగిలిన ఆటలు కన్పించడం సంతోషాన్ని కలిగిస్తోందని కొందరు హాకీ, పుట్‌బాల్ క్రీడాకారులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
|
|