అస్పష్టమైన ఎన్నికలతో ఇబ్బందులు తప్పవు-పిఎం
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం
అస్పష్టమైన ఎన్నికల ఫలితాలతో అధికారంలోకి వచ్చే కూటమికి నాయకత్వం వహించే పార్టీకి ఇబ్బందులు తప్పవని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. భారత-అమెరికా అణు ఒప్పందానికి మిత్రపక్షాలైన వామపక్ష పార్టీల నుంచి ఎదురౌవుతున్న అనుభవాల నేపథ్యంలో ప్రధాని ఇలా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మన్మోహన్ సింగ్ సమకాలీన పోటీ రాజకీయాలు మరియు అస్పష్ట ఎన్నికల ఫలితాలతో అనుకున్న పనులు జరగడం కష్టతరంగా మారిందన్నారు. అయితే ఆయన అణు ఒప్పందం అంశాన్ని నేరుగా ప్రస్తావించకపోవడం విశేషం.