|
|
 |
పాకిస్థాన్ అణు శాస్త్రవేత్తలు తమ దేశానికి ఆస్తులు వంటి వారని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షౌకత్ అజీజ్ తెలిపారు.పాక్ అణు పితామహుడు అబ్దుల్ ఖాదీర్ ఖాన్ ను మరే ఇతర దేశానికి గానీ లేదా సంస్థకు గానీ అప్పగించమని అజీజ్ అన్నారు. అణు సాంకేతిక పరిజ్ఞానం రహస్యంగా పాక్ నుంచి తరలివెళ్లడంలో ఖాన్ పాత్రను ప్రశ్నించేందుకు అతన్ని తమకు అప్పగించాలని కొన్ని దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు కోరుతున్నాయి. దీనిపై షౌకత్ అజీజ్ మాట్లాడుతూ తమ దేశ అణు శాస్త్రవేత్తలకు తమకు ఆస్తులు వంటి వారని, వారికి హాని కలిగించే పనులను పాక్ ప్రభుత్వం చేయబోదని పాక్ ప్రధాని షౌకత్ అజీజ్ స్పష్టం చేశారు.
|
|