స్పీడ్ వైపు భారతీయ రైల్వే !
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

  భారతీయ రైల్వే కొత్తగా స్పీడు వైపు మోగ్గు చూపుతుంది. ఢిల్లీ- ఆగ్రాల మధ్య భోపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వేగాన్ని గంటకు 150 కిలోమీటర్లకు పెంచిన రైల్వేస్ ప్రస్తుతం ఢిల్లీ- కాన్పూర్‌ల మధ్య లక్నా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వేగాన్ని కూడా ఈ మేరకు పెంచాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను భారతీయ రైల్వే సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఇందుకోసం అవసరమైన పనులు చేపట్టడంతో పాటు ట్రాక్‌లను, సిగ్నల్ వ్యవస్థను పటిష్ట పరిచేందుకు రైల్వేస్ చర్యలు చేపట్టింది. ఢిల్లీ- కాన్పూర్‌ల మధ్య కొన్ని ప్రాంతాలను సమస్యాత్మకంగా రైల్వేస్ గుర్తించింది. ఈ ప్రాంతాల్లో మరమత్తులు కొనసాగుతున్నాయని ఓ సీనియర్ రైల్వే అధికారి చెప్పారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.