|
|
 |
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్ ఛార్జిగా నియమితులైన కర్ణాటక నేత వీరప్ప మొయిలీ ప్రత్యేక తెలంగాణా గురించి మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణా కోసం రెండో ఎస్సార్సీ ఏర్పాటు పై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సుముఖంగా ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జిగా నియమితులైన మొయిలీ బుధవారం తొలిసారిగా హైదరాబాద్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన లేక్ వ్యూ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు.ఆయన ప్రత్యేక తెలంగాణా రెండో ఎస్సార్సీనే సాధ్యమని పేర్కొన్నారు. దీని ఏర్పాటు అనేది రాజ్యాంగ పరమైన అంశమని, అందువల్ల ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చించనున్నట్టు మొయిలీ వివరణ ఇచ్చారు.
|
|