|
|
సమ్మె హక్కుకు చట్టబద్దత కల్పించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు విధులను బహిష్కరించి వారివారి కార్యలయాల ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టారు. జాయింట్ యాక్షన్ కమిటీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా మంగళవారం నిరసనకు దిగారు. ఉద్యోగులు తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమాల వల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో విధులకు ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వ ప్రధాన పరిపాలనా విభాగం సచివాలయంలో కూడా ఉద్యోగులు ఆందోళనలో పాల్గొనడంతో దానిలో కూడా ఉద్యోగుల హాజరు శాతం తగ్గింది. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ కోర్కెల పరిష్కారానికి సమ్మె ప్రధాన ఆయుధమని, దీనికి చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంట్‌లో ఓ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
|
|