ముంచెత్తుతున్న వరదలు
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

 ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం మరో ఇరవై నాలుగు గంటలపాటు కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జాలర్లు చేపలవేటకు వెళ్ళడాన్ని నిషేధించింది. సముద్రతీరం వెంబడి అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేసింది. భారీవర్షాలకు వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. వర్షాల కారణంగా తిరుచ్చి, కుంభకోణం జిల్లాలో దాదాపు పదిహేను మంది మరణించినట్టు అధికారులు చెప్పారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.