|
తేజస్ యుద్ధవిమానం నుండి క్షిపణులను విజయవంతంగా ప్రయోగించినట్టు భారత రక్షణశాఖ అధికారులు తెలిపారు. గగనతలం నుంచి గగనతలంలోని లక్షాలను ఛేదించడానికి పూర్తి దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్ నుండి క్షిపణుల పరీక్ష విజయవంతం కావడంతో ఈ యుద్ధ విమానం మరో కీలక దశ పూర్తి చేసుకుంది. రష్యాకు చెందిన ఆర్-73 రకానికి చెందిన క్షిపణులను ఈ ప్రయోగంలో వినియోగించినట్టు రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ఆనందం వ్యక్తం చేసిన రక్షణశాఖ అధికారులు భారత రక్షణ విభాగంలో ఇది మరో గొప్ప మైలురాయిగా పెర్కొన్నారు. క్షిపణి ప్రయోగం విజయం కావడంతో ఈ రకం విమానాల తయారీకి భారత్ పూనుకోనుంది. 2013 నాటికి తేజస్ విమానాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని రక్షణశాఖ తెలిపింది.
|