|
|
 |
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చిత్తూరు పర్యటనలో గురువారంనాడు కలకలం చెలరేగింది. చంద్రబాబు రావడానికి కొద్ది ముందు ఎన్టీఆర్ విగ్రహం వెనకు యాసిడ్ క్యాన్ ను పోలీసులు గుర్తించారు. దీంతో పార్టీ కార్యకర్తల్లో కలకలం చెలరేగింది. యాసిడ్ క్యాన్ ను ఎందుకు, ఎవరు పెట్టారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వెళ్తూ ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించాల్సి ఉంది. ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి చేరుకోవడానికి కొద్ది ముందుగా పోలీసులు ఆ యాసిడ్ క్యాన్ ను కనుగొన్నారు. చంద్రబాబు పార్టీ కార్యాలయ ప్రారంభ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.
|
|