|
|
 |
మధ్యాన్ని నియంత్రించడానికి లోక్ సత్తా జాతీయ కన్వీనర్ జయ ప్రకాశ్ నారాయన్ చేపట్టిన పాదయాత్ర విజయవంతమయ్యింది. గుంటూరు జిల్లా పెదగొట్టిపాడు నుంచి మంగళవారం ఆయన ఈ పాదయాత్ర మొదలు పెట్టారు. మొత్తం తొమ్మిది గ్రామాలలో పాదయాత్ర నిర్వహించారు.పార్టీ రాష్ట్ర నాయకులు, స్థానిక మహిళలు పాల్గొన్న ఈ పాదయాత్రకు మహిళల నుండి విశేష స్పందన లభించింది. మొదటి రోజు 21 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని తెలిపారు. మద్యం నియంత్రణ, బెల్ట్ షాపుల మూసివేత జరిగే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని కూడా ఆయన పేర్కొన్నారు. అలాగే 24,25 తేదీలలో కూడా మరో మారు పాదయాత్ర నిర్వహించనున్నట్టు లోక్‌సత్తా పార్టీ తెలిపింది.
|
|