|
ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖరరెడ్డి సోమవారం జూబ్లిహాల్ లో కలెక్టర్ల తో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలో కలెక్లర్ల కృషిని ముఖ్యమంత్రి అభినందించారు. రాష్ట్రంలోని ప్రతి పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి తమ వంతు కృషి చేయాలని వైఎస్ కలెక్టర్లను కోరారు. ఇప్పటివరకూ ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాలు 59 శాతం వరకూ పూర్తయ్యాయని ముఖ్యమంత్రి తెలియజేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపు మిగిలిన ఇళ్ళ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
|