కర్ణాటక లో హైడ్రామా
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

 కర్నాటకలో రాజకీయ డ్రామా రోజుకో సరికొత్త మలుపులు తిరుగుతోంది. సొంత పార్టీలో చీలికను నియంత్రించడానికి బిజెపితో పొత్తుకు సిద్దపడ్డ జనతాదళ్ కు కొత్త ఇబ్బందులు ఎదురయ్యాయి. జనతాదళ్ పార్టీ పార్లమెంటు సభ్యుడు ప్రకాష్ ఈ సంకీర్ణానికి ససేమీరా ఒప్పుకోక పోవడమే తాజా కలహానికి కారణం. జనతాదళ్ పార్టీలోని మొత్తం 55 మంది బలగం తన వెంటే ఉన్నారని, బిజెపితో పొత్తుకు వారు సిద్దంగా లేరని దేవెగౌడకు ప్రకాష్ షాకిచ్చారు. ఇదిలా ఉండగా, అసమ్మతికి తెరదించడానికి జనతాదళ్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కోలార్ లోని రహస్య శిబిరానికి తరలించినట్లు సమాచారం. బిజెపి కూడా తమ ఎమ్మెల్యేలందరినీ బెంగళూరు శివార్లలోని శిబిరానికి తరలించి జనతాదళ్ అధినాయకత్వంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. ఏది ఏమైనా యడియూరప్ప నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం అంత సులభంగా జరిగే పనిలా కనబడడం లేదు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.