|
|
 |
రాష్ట్రంలో హత్యారాజకీయాలను సాగనివ్వమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా గురువారం రాత్రి గుడిపాల మండలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకనే కాంగ్రెస్ ప్రభుత్వం హత్యారాజకీయాలకు సాగిస్తోందని విమర్శించారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేస్తామన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే 120 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పొట్టన పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన దారుణాలకు మూల్యం చెల్లించాల్సిన రోజు దగ్గర్లోనే ఉందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
|
|