|
|
 |
హైదరాబాద్: హైదరాబాద్ లో గురువారం ఉదయం ఆర్టీఎ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి 150 ఆటోలను సీజ్ చేశారు. డిజిటల్ మీటర్లు లేని ఆటోలను నిలిపివేసి సీజ్ చేస్తుండదంతో ఆటోవాలాలు తిరుమలగిరి ఆర్టీఎ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్నారు. ఫలితంగా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. డిజిటల్ మీటర్లు వ్యవహారంపై బుధవారం రవాణాశాఖామంత్రి కన్నా లక్ష్మీనారాయణతో ఆటో యూనియన్ నేతల చర్చలు విఫలమైన సంగతి విదితమే. అయితే ఆటో యూనియన్ నేతలు మాత్రం డిజిటాల్ మీటర్లను ఏర్పాటు చేసేది లేఅదంటూ తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం నుండి రవాణా శాఖకు అందిన ఆదేశాల మేరకు ఆర్టీఎ అధికారులు, ట్రాఫిక్ అధికారులు మూకుమ్మడిగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆటోలను నిలిపి తనిఖీ చేస్తున్నారు. సీజ్ చేయని మీటర్లను పరిశీలించి ఆటోవాలాలు ప్రయాణికులనుండి ఎంతమేర దండుకున్నారో అంచనాలు వేసి ఆటోలను సీజ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ తీరును నిరశిస్తూ సమ్మెకు ఆటో యూనియన్ నేతలు హెచ్చరిస్తున్నారు.
|
|