ఈ నెల 29,30 తేదీలలో మెడికల్ కౌన్సెలింగ్
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం
మెడికల్ డిగ్రీలో చేరడానికి ఈ నెల 29,30 తేదీలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. హోమియో, నెచురోపతి, ఆయుర్వేదం కోర్సులకు ఈ సందర్భంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని యూనివర్సిటీ చెప్పింది. మొదటి విడత కౌన్సెలింగ్ కు హాజరు కాని విద్యార్థులు కూడా ఈ కౌన్సెలింగ్ కు హాజరు కావచ్చని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. ఆర్మీ, వికలాంగులు కోటా విద్యార్థులకు సంబంధించిన సీట్లకు 29 ఉదయం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపింది.