|
|
 |
కడప : ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శుక్రవారం కదపలో ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం లోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. తమ పాలనాకాలంలో ఎవరూ ఈతి భాదలు అనుభవించరాదన్నదే తమ అభిమతమని వైఎస్ తెలిపారు. కడప పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ సందర్భంగానే ముఖ్యమంత్రి కుమారుడు జగన్మోహన్ రెడ్డి రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన గృహాన్ని వైఎస్ ప్రారంభిస్తారు. జగన్మోహన్ రెడ్డి స్థానిక బాకరాపురం వద్ద నిర్మించిన నూతన గృహంలో వైఎస్ ఒకరోజు బస చేస్తారు. అనంతరం స్థానికంగా వెంకటప్పమెమొరియల్ స్కూలును, వృద్దాశ్రమాన్ని నూతన ఐఐటి భవనాలను వైఎస్ సందర్శించనున్నట్లు సమాచారం. మరుసటిరోజు వైఎస్ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
.
|
|