|
సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వోద్యోగుల వ్యక్తిగత సమాచారం అందించలేమని కేంద్ర సమాచార కమిషన్ పేర్కొంది. ఇలాంటి విజ్ఞప్తులను ప్రోత్సహించరాదని సమాచార కమిషనర్ ఏఎన్ తివారి తెలిపారు. ప్రధానంగా మహిళా ఉద్యోగుల సమాచారం అందించరాదన్నారు. నోయిడాకు చెందిన న్యాయవాది ఎస్డీ కథూరియా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సందర్భంగా ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. నౌకాయాన శాఖ మంత్రిత్వ శాఖ వివరాలతో పాటు అందులో స్టెనోగా పనిచేస్తున్న లవ్లీన్ కుమారి వైవాహిక స్థితి వివరాలను కోరుతూ ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వివరాలు వ్యక్తిగత అంశంతో ముడిపడినదైనందున దీనికి సంబంధించి సమాచారం అందించలేమని కేంద్ర నౌకాయాన శాఖ చెప్పడంతో ఈ విషయం కేంద్ర సమాచార కమిషన్ వరకు వెళ్లింది.
|