|
|
 |
రాష్ట్ర పోలీసు చరిత్రలో మరో మలుపు రానుంది.నేరం జరిగిన స్థలం నుంచే వేలిముద్రలు, నేరగాళ్ల ఫోటోలను విశ్లేషించే సామర్థ్యం దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్ర పోలీసుల సొంతమైంది.పోలీసు వ్యవస్థ అభివృద్ది లో భాగంగా డీజీపీ బాసిత్ గురువారం తన కార్యాలయంలో జిల్లాకు ఒకటి చొప్పున అన్ని క్లూస్ టీంలకు ల్యాప్ టాప్ లు అందజేశారు. ఈ ల్యాప్ టాప్ లలో పేరుమోసిన నిందితుల ఫోటోలను కూడా అమర్చారు.నేర దర్యాప్తులో వేలిముద్రలే కీలకం.కొత్త విధానం వల్ల ఏ నేరం ఎక్కడ జరిగినా క్లూస్ టీం అక్కడకు వెళ్లి, నేరం జరిగిన స్థలంలో వేలిముద్రలు సేకరించి, తమ వద్ద ఉన్న ల్యాప్ టాప్ నుంచి ఇంటర్నెట్ ద్వారా సీఐడీ డేటాబేస్ కు పంపుతారు. అక్కడ కంప్యూటర్లు వీటిని విశ్లేషించి వాటికి తగిన సమాచారాన్ని అందిస్తాయి. వేలిముద్రలు సేకరించిన కొద్దిసేపట్లోనే ఈ వ్యవహారమంతా జరుగుతుంది. దీనివల్ల నిందితుడు ఎక్కువ దూరం పొక మునుపే పట్టుకునే వీలుంది.
|
|