|
|
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించింది.56 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 24.4 నుంచి 3014కి పెరిగిన డీఏ, ఈ ఏడాది జులై నుంచి వర్తిస్తుందని, అక్టోబర్ జీతంతో పెంచిన మొత్తాన్నీ చెల్లించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఇప్పటివరకూ రావాల్సిన మొత్తాన్నీ మాత్రం ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమచేయనున్నట్టు వారు తెలిపారు. స్ధానిక సంస్ధల్లో ఉద్యోగులు, ఎయిడెడ్ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది, విశ్వవిద్యాలయాల సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుంది. 2003 జులై తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులతో పాటు అప్పటికే కన్సాలిడేట్ ఆఫ్ పింఛన్ పొందుతున్నవారికి కూడా నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వవర్గాలు వివరించాయి.
|
|