|
|
|
హైదరాబాద్: తమ డిమాండ్లపై చర్చించకుండా సభను వాయిదావేయడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు వద్ద ధర్నాకు దిగారు. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్ సర్కార్ విధానాలతో రాష్ట్రంలో వ్యవసాయం మూలనపడే ప్రమాదం ఏర్పడిందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వంగా పేర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ అన్నదాతను మోసం చేస్తోందని వారు విమర్శించారు. చంద్రబాబు ఏరువాకతో జడిసిన సర్కారు అణిచివేత ధోరణిని అవలంబిస్తోందని ఆరోపించారు. కేంద్రం ఆంధ్రపై వివక్ష చూపిస్తోందని, ముఖ్యమంత్రి దాన్ని కూడా పదవులకోసం పాకులాడుతూ దాన్ని మర్చిపోయారని ఆన్నారు. తాము అఖిలపక్షాన్ని తీసుకెళ్లమని చెప్పినా, ఒంటరిపోరు చేసిన వైఎస్ ఏం సాధించారని ప్రశ్నించారు. చంద్రబాబు మాట్లాడేందుకు ఢిల్లీ వెళితే, కనీసం అపాయింట్ మెంట్ కూడా దొరక్కుండా చేశారని అన్నారు.
|
|