బౌలర్ల వైఫల్యం: టీం ఇండియా ఓటమి !

 

టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

     ట్వంటీ- 20 పపంచ కప్ సూపర్ ఎయిట్ లో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్ లో నూజిలాండ్ జట్టు భారట్ పై 10 పరుగుల తే్డాతో విజయం సాధించింది.మోదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 190 పరుగులు చేసి ఆలౌటయింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లలలో మెక్ కలమ్ 45, మెక్ మిలన్ 44, ఓరమ్ 35 పరుగులతో జట్టు భారీ స్కోరు చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత ఓపెనర్లు గంభీర్, సెహ్వాగ్ లు న్యూజిలాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని మొదటి వికెట్ కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తరువాతి బ్యాట్స్ మెన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. పాకిస్తాన్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో విఫలమయిన సెహ్వాగ్ ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు. కేవలం 17 బంతుల్లో 2 సిక్సర్లు, 6 బౌండరీల సహాయంతో 40 పరుగులు సాధించాడు. మరోవైపు గంభీర్ కూడా బౌలర్లను ధీటుగా ఎదుర్కొనే పనిలో సఫలుడయ్యాడు. అర్ధసెంచరి సాధించాడు. ఈ ఇద్దరు కలిసి 5.5ఓవర్లలో 76 పరుగులు చేసి దూసుకువెళుతున్నట్లు కనిపిస్తున్న తరుణంలో సెహ్వాగ్ ఓరమ్ బౌలింగ్ లో నిర్లక్షమైన షాట్ కొట్టి మిడాన్ లో ఉన్న స్టైరిస్ చేతికి చిక్కాడు. ఈ తరుణంలో వచ్చిన ఊతప్ప కూడా వెన్వెంటనే పెవిలియన్ చేరాడు. తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్లో కేవలం శ్రీశాంత్ కొద్దిగా పోరాటపటిమ ప్రదర్శించిన ఫలితం లేకపోయింది. భారత బ్యాట్స్ మెన్ లలో సెహ్వాగ్ 40, గంభీర్ 51, ధోని 24, కార్తీక్ 17, శ్రీశాంత్ 19 పరుగులు చేశారు. నాలుగు వికెట్లు కూల్చి విజయంలో కీలక పాత్ర పోషించిన వెటోరికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ను నిలువరించడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.