ధోనీకి ఈ సిరీస్ అగ్ని పరీక్షగా నిలువనుంది
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

బెంగులూరు  : అతితక్కువ నిడివిగల క్రికెట్ టోర్నీలో ప్రపంచ విజేతగా నిలిచిన జట్టుకు సారధ్యం వహించిన ఎం.ఎస్.ధోనీ ఇప్పుడు నాలుగు సార్లు వన్డే ఛాంపియన్లుగా నిలిచి మహాబలశాలు జట్టుగా కీర్తిగడించిన ఆస్ట్రేలియా జట్టును ఢీకొనబోతున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగనున్న ఏడు మ్యాచ్ ల సిరీస్ తొలి మ్యాచ్ శనివారం నాడు బెంగుళూరులో జరగనుంది. పెద్దగా అనుభవంలేని యువ క్రికెటర్లతో ఇటీవల ట్వంటీ20 ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ లో నెగ్గుకొచ్చిన కొత్త కెప్టెన్ ధోనీకి ఈ సిరీస్ అగ్నిపరీక్షగా నిలువనుంది. ఎంత 'మిస్టర్ కూల్' గా పేరు తెచ్చుకున్నప్పటికీ జట్టుకు సారధ్యం వహించడమనేది అంత సులువైన పనేమీ కాదు. ఇప్పటికే ఆస్ట్రేలియా కెప్టెన్ భారత జట్టుపై మానిసికంగా పైచేయి సాధించేందుకు మాటల యుద్దం మొదలేట్టాడు. వాటికి భారత యువ క్రికెటర్లు కొందరు నిన్నే సమాధానం చెప్పినప్పటికీ ముఖ్యంగా ధోనీ ఎలా నిలబడతాడు, జట్టును ఒక్క తాటిపై ఎలా నడిపిస్తాడో చూడాలి. కెప్టేన్ గా పేరుతెచ్చుకున్న గంగూలీ జట్టులోనే వుండడం ధోనీకి లాభించే విషయం. ఎంతో అనుభవమున్న సచిన్-గంగూలీ జోడీ ఓపెనింగ్ జట్టుకు లాభించే విషయం.అయితే సెమీఫైనల్ లో ఊహించని పరాజయంతో దెబ్బతిన్న పులిలా వున్న ఆస్ట్రేలియా రెచ్చిపోకుండా కాపుకాసుకోవల్సిన బాధ్యత ధోనికి శుక్రవారంనాడు నిద్ర పట్టనివ్వకపోవచ్చు. కాగా, ఈ పిచ్ బ్యాట్స్ మెన్, బౌలర్లకు సమానంగా సహకరిస్తుందని, మంచి మ్యాచ్ చూసే అవకాశం వుందని క్యూరేటర్ నారాయణరాజు చెబుతున్నారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.