|
తీవ్రవాదుల చర్యలను అదుప చేయడం లో యూపీఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ విమర్శించింది. దేశంలో పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను అదుపు చేయడంలో విఫలమైన యూపీఎ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చింది.భోపాల్ లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు ఓ తీర్మానం చేశారు.గత పదేళ్లలో 50వేల మంది అమాయకులు తీవ్రవాదానికి బలయ్యారని పేర్కొంది. అయితే స్వాతంత్ర్య పోరాటం తర్వాత ఇప్పటివరకు 8020 మంది జవాన్ లు మాత్రమే మరణించారని గుర్తు చేసింది.
|