|
|  |
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా రాహుల్ గాంధిని నియమించారు. గాంధి- నెహ్రూ కుటుంబ వారసుడిగా, కాంగ్రెస్ లో కాబోయే ప్రధానిగా భావిస్తున్న అమేథీ ఎంపీ రాహుల్ గాంధిని కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్టు పార్టీ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఆయనకు యువజన వ్యవహారాలు, విద్యార్థి విభాగం బాధ్యతలు అప్పగించారు. ఈ దఫా మార్పుల్లో భాగంగా ప్రియాదత్, జతిన్ ప్రసాద్ వంటి యువనేతలకు సైతం స్థానం దక్కింది. పార్టీలోని వివిధ వర్గాల నుంచి అధిష్టానంపై ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో రాహుల్ నియామకం జరగడం గమనార్హం. గత ఏడాది హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సందర్భంగా తాను పార్టీలో కీలక బాధ్యతలు పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని రాహుల్ సైతం స్వయంగా ప్రకటించారు.ఆయనకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించడంతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కూడా స్థానం కల్పించారు.
|
|