ప్రభుత్వం పై డిమాండ్ -ప్రతిపక్షాలు

 

టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

' హోంమంత్రి జానారెడ్డితో పాటు మరికొంత మంది ఐఏఎస్ అధికారులు అవినీతిపరులని మాజీ ఐఏఎస్ అధికారి సమాల్ చేసిన ప్రకటనపై ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని అన్ని రాజకీయపక్షాలు కలసి డిమాండ్ చేశాయి. సమాల్ నివేదికతో తప్పేమీ లేదని, ప్రభుత్వం అవినీతి స్ధాయి దాటి లూటీ స్ధాయికి చేరిందని సీపీఎం కార్యదర్శి రాఘవులు ఆరోపించారు. సమాల్ ఈ ఆరోపణలు కేవలం అసూయ తో చేశారా లేక కక్షతో చేశారా అనే దానికి ప్రభుత్వం నుంచి సమాధానం రావాలని ఆయన అన్నారు. సమాల్ లేఖలపై ముఖ్యమంత్రి తక్షణమే జవాబుచెప్పాలని టీడీపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేఖలపై చర్చలకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని అన్నారు. ప్రభుత్వ అవినీతిని మీడియా ఎండగడుతుంటే, అసలు పట్టించుకోని ప్రభుత్వం ఏం ప్రభుత్వమని ఆయన ప్రశ్నించారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.