ఇక పై పొత్తు పెట్టుకోం-కె.సి.ఆర్
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

రానున్న ఎన్నికలలో ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోమని తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరెడ్డి చెప్పారు. మధ్యంతర ఎన్నికలు లోక్ సభలోనే కాదని, అసెంబ్లీ ఎన్నికలు కూడా రానున్నట్లు ఆయన చిలుక జోస్యం చెప్పారు. హైదరాబాద్ లో సోమవారం కార్యవర్గ సమావేశాలు ముగిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో రాజకీయ సంక్షోభం ఏర్పడుతుందని అన్నారు . ఆ సమయంలో తెరాస ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. మధ్యంతర ఎన్నికల నిర్వహించే పక్షంలో తెలంగాణా ప్రాంతంలో తమదే పైచేయి కాగలదని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి, కేసీఆర్ కుమారుడు కె రామారావు తదితరులు పాల్గొన్నారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.