|
|  |
అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాలనలో ఆ దేశ ఉపాధ్యక్షుడుగా విధులు నిర్వహించిన ఆల్ గోర్ 2007 సంవత్సరానికి నోబెల్ అవార్డును గెలుచుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కు గోర్ చేసిన విశేష కృషికి ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. అలాగే ఆయన చేపట్టిన గ్లోబల్ వార్మింగ్‌పై ఎంతో ఉన్నతం గా కృషి సల్పుతున్నారు. రాజకీయ పరంగా పర్యావరణ పరిరక్షణ విషయంలో నోబెల్ గ్రహీతగా తొలిసారి గోర్ చరిత్ర సృష్టించనున్నారు. నిజానికి పర్యావరణ పరిరక్షణ అంశంలో 175 మందికి పైగా అభ్యర్థులు జాబితాలో ఉండగా, గోర్ ఈ అవార్డుకు ఎంపిక కావడం విశేషం. గత ఏడాది గోర్ వాతావరణ మార్పిడిపై తీసిన యాన్ ఇన్‌కన్వీనియంట్ ట్రూత్ చిత్రానికి మంచి పేరు వచ్చింది.
|
|