|
|  |
రాష్ట్రంలో పెరిగిపోతున్న ధరలకు వ్యతిరేకంగా వామపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలను వామపక్ష నేతలు ముట్టడించారు. పేదలకు భూములను పంపిణీ చేయాలని కోరుతూ భూ పోరాటాలను ఉధృతం చేసిన వామపక్షాలు అధికధరలపై ఆందోళనలు చేపట్టాయి. విజయవాడ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ ఆందోళనలో దాదాపు 300 మంది సీపీఎం, సీపీఐ కార్యకర్తలు పాల్గొన్నారు. సామాన్య మానవునికి అత్యవసర వస్తువుల ధరలు అందుబాటులో ఉండాలని ధరలను వెంటనే తగ్గించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు.
|
|