|
|  |
ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రకటించారు. దీనికోసం వచ్చే రెండేళ్లలో అన్ని గ్రామాలకూ తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.2,000 కోట్లు ప్రభుత్వం వ్యయం చేస్తుందన్నారు. రాష్ట్రంలో మొత్తం 72,208 గ్రామాలు ఉన్నాయని,తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ కాలంలో దాదాపు 13 వేల గ్రామాలకు మంచి నీటి సరఫరా చేయటం జరిగిందన్నారు. అలాగే స్వజల ధార పధకం కింద 180 గ్రామాలకు రక్షిత మంచినీటిని మంజూరు చేశామన్నారు. పట్టణాల్లో తాగునీటి సమస్యల పరిష్కారం మాత్రం జిల్లా కలెక్టర్లదే బాధ్యత అన్నారు.
|
|