చంద్రబాబు పై 'ఇంద్ర'సేనారెడ్డి అక్షింతలు
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

తెదేపా అధినేత,మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుని భాజపా రాష్ట్రనేత ఇంద్రసేనారెడ్డి విమర్శించారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు పోటాపోటీగా హామీల హామీలు ఇస్తున్నా ఇంద్రసేనారెడ్డి మాత్రం నారా చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. ఎకనామిక్స్ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు 2004కు ముందు ఎంఏ ఎకనామిక్స్ చదవలేదా? అని ప్రశ్నించారు. గత ఓటమి తర్వాతే ఎకనామిక్స్ తెలిసొచ్చాయా? అని ప్రశ్నించారు. ఆయన మంగళవారం డిల్లీ లో భాజపా ప్రధాన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. గతంలో ఉచిత విద్యుత్తు సాధ్యంకాదని తేల్చిచెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎవర్ని మోసం చేయడానికి ఆ వాగ్దానం చేస్తున్నారని ప్రశ్నించారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.