సిపిఐ ఆధ్వర్యం లో లూటీ
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

  నిత్యావసర సరుకుల అధిక ధరలకు నిరసనగా సిపిఐ కార్యకర్తలు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా గోదాములపై దాడులు చేశారు. హైదరాబాదులోని నాగార్జునసాగర్ రోడ్డులో గల పోస్టర్ కోల్డ్ స్టోరేజీ అనే ప్రైవేట్ గోదాముపై పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ ఆధ్వర్యంలో సిపిఐ కార్యకర్తలు దాడి చేశారు. గోదాములో పప్పు ధాన్యాలు, ఎండుమిర్చి, చింతపండు లూటీ చేశారు. ఈ దాడి సమయంలో గోదాము యజమానికి, ఆందోళనకారులకు మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా నారాయణ విమర్శించారు.అనంతపురంలో గోదాముపై దాడి చేసిన సిపిఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.