|
లక్నో : ఉత్తరప్రదేశ్ లో అవినీతిని రూపుమాపేందుకు దృఢ నిశ్చయంతో ఉన్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి అన్నారు. అయితే ఈ క్రమంలో తాము ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని ఆమె స్పష్టంచేశారు. బహుజనసమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ ప్రథమ వర్థంతిని పురస్కరించుకొని మాతా రమాభాయ్ అంబేద్కర్ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో ఆమె ప్రసంగించారు. మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ విధానాలను ఆమె దుయ్యబట్టారు. ములాయం సారథ్యంలోని సమాజ్ వాదీ పార్టీ నేరగాళ్లతో నిండి పోయిందని ఆమె ఆరోపించారు. గత ప్రభుత్వహయాంలో చేపట్టిన పోలీసు నియామక ప్రక్రియ అవినీతితో నిండి పోవడం వల్లనే దానిని నిలిపివేసినట్టు ఆమె ప్రకటించారు.
|