|
|  |
రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా చేపట్టాలని పార్టీ నాయకులకు చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు. వచ్చే ఎన్నికల్లో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు తమ పార్టీ పూర్తి చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. తెదేపా చేపట్టిన విధానాలతోనే రాష్ట్రంలో సంపదలు పెరిగాయని, పేదలకు అందవలసిన రుణాలు అందాయని ఆయన తెలిపారు. మధ్యంతర ఎన్నికలు జరుగనున్న వూహాగానాల నేపథ్యంలో తెదేపా రాష్ట్ర స్థాయి సమావేశం సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగింది. ఈ సమావేశంలో బాబు మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ అవినీతి పాలన క్షీణిస్తేనే సాధ్యమని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన కుటుంబీకుల అరాచకాలు, అక్రమాలు ప్రజలకు అవగతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
|
|