రాష్ట్రం లో పార్టీలు బియ్యం మంత్రాన్ని జపిస్తున్నాయి-బిజెపి
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మధ్యంతర ఎన్నికల్లో అందలం ఎక్కటానికి బియ్యం మంత్రాన్ని జపిస్తున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దత్తాత్రేయ చెప్పారు. స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో మాత్రమే బియ్యం పథకం సజావుగా అమలై పేద ప్రజలకు చేరువైందన్నారు. ఎన్టీఆర్ ప్రాణం పోసిన ఈ పథకాన్ని కాపీ కొట్టి అమలుచేసిన అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డికి 1983 ఎన్నికలలో ఓటమి తప్పలేదన్నారు. ప్రజలకు అత్యవసరమైన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించకుండా బియ్యం వైపు మళ్లటంవల్ల వారి కష్టాలు మరింత పెరుగుతాయని అన్నారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.