|
|
|
ప్రతి ఏడాదికోసారి కనిపించే అతిపెద్ద చంద్ర దర్శనం శుక్రవారం కనిపించి, కనువిందు
చేయనుంది. చందమామ రావే... జాబిల్లి రావే... అంటూ చిన్నారులను లాలించేందుకు ఎంత
పిలిచినా దిగిరాని చంద్రుడు,శుక్రవారం మాత్రం భూమికి అతి దగ్గరగా రానున్నాడు. ఈ
కారణంగా చంద్రుడు మామూలు పరిమాణం కంటే, అతిపెద్దగా కనిపించనున్నాడు. ఈ శుభ సందర్భంలో
చందమామను తనివితీరా చూసుకోవచ్చు. ఇలాంటి అవకాశం ఏడాదికోసారి మాత్రమే వస్తుంది. ప్రతి
పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా కనిపించడం మామూలే.
కానీ ఈ గురువారం, శుక్రవారాల్లో వచ్చే చంద్రుడు 14 శాతం పెద్దగా దర్శనమివ్వనున్నాడు.
అలాగే చంద్ర వెలుగులు కూడా 30 శాతం అధికంగా విరజిమ్ముతాడని అమెరికాకు చెందిన నాసా
నిపుణులు వెల్లడించారు. సాధారణంగా చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో
తిరుగుతాడు. ఆ సమయంలో భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న కనిష్ఠ దూరం 48 వేల కిలోమీటర్లు.
ఈ పౌర్ణానికి భూమికి అతి సమీపానికి వచ్చే చందమామను మాత్రం టెలిస్కోప్‌లో తగిన
ఫిల్టర్లు లేకుండా దర్శించడం నేత్రాలకు హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు
|
|