వినాయక్‌-గోగులమధ్య విభేదాలు
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

 సీనిరంగంలో దీర్ఘకాలిక స్నేహాలుగాని, శత్రుత్వాలుగాని ఉండవన్నది ఓ నానుడి. గతంలో దీనికి పలు ఉదాహరణలున్నాయి. తాజాగా దర్శకుడు వి.వి.వినాయక్‌కు, సంగీత దర్శకుడు రమణ గోగులకు మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. వినాయక్‌, గోగుల మంచి మిత్రులన్ని సినీ పరిశ్రమ అంతటికీ తెలిసిందే. మణిశర్మతో కొన్ని సమస్యలు తలెత్తినందున గోగులను 'యోగి', 'లక్ష్మి' సినిమాలకు సంగీత దర్శకునిగా వినాయక్‌ ఎంచుకున్నారని భోగట్టా. తాజాగా రవితేజ, త్రిష కాంబినేషన్‌లో వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు కూడా రమణ గోగుల సంగీత దర్శకునిగా పనిచేస్తారని ప్రకటించారు. అయితే వారిద్దరికీ విభేదాలు ఏర్పడడంతో ఈ ప్రాజెక్టునుంచి రమణ గోగులను తప్పించారని, తిరిగి మణిశర్మతో వినాయక్‌ జతకట్టనున్నారని తెలుస్తోంది.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.