|
|
|
దొరై దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం నేపాలి చిత్రం తెలుగులో శ్రీమహాగణపతి ఫిలింస్ సంస్థ చిత్రీకరిస్తోంది. మీరాజాస్మిన్, భరత్ జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఆర్‌బీ చౌదరి ఆశీస్సులతో డబ్బింగ్ కార్యక్రమాలు దసరాపండుగా సందర్భంగా ప్రారంభమైన ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలను చేస్తున్నట్లు శ్రీ మహాగణపతి ఫిలింస్ సంస్థ ఛైర్మన్ సుధాకర్ చెప్పారు. ఈ చిత్రంలో భరత్ మూడు వేష ధారణల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నట్లు తెలిపారు. అలాగే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సంగీతం శ్రీకాంత్ దేవా చక్కని బాణీలు అందిస్తున్నారు. ఈ చిత్రంలో మరో ప్రత్యేక అంశం మీరాజాస్మిన్ తొలిసారిగా ముద్దు సీన్‌లో నటించడం విశేషం. ఇది కథా పరంగా మాత్రమే ఉంటుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.
|
|