|
|
|
హ్యాపీ డేస్ చిత్రంతో మరోసారి యూత్ కు హాట్ ఫేవరేట్ గా మారిన దర్శకుడు శేఖర్ కమ్ముల. కేవలం ప్రేక్షకులే కాదు, సినిమారంగంలోని పలువురు ప్రముఖులు కూడా శేఖర్ అంటే ఇష్టపడుతున్నారట. తాజాగా, ఈ ఇంటర్వ్యూలో మహేష్ బాబు శేఖర్ ను తెగ మెచ్చేసుకున్నాడు. సుకుమార్, బొమ్మరిల్లు ఫేం భాస్కర్ చిత్రాలన్నీ చాలా చక్కగా ఉంటున్నాయని అభినందించాడు కూడా. మరో సినిమా కోసం కాస్త రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఒక మహేష్ తో శేఖర్ సినిమా నిర్మించనున్నాడన్న వార్తలు ఏ మేరకు కార్యరూపం దాలుస్తాయో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే మరి..!!
|
|