|
|
|
వేణు తొట్టేంపూడి హీరోగా ఎ.ఎ.ఎ. క్రియేషన్స్ బ్యానర్‌పై టి.కృపాకర్‌రెడ్డి 'దీపావళి' అనే ఓ కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి హరిబాబు దర్శకుడు. వేణు సరసన మేఘానాయర్ అనే కొత్తమ్మాయి హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఆర్తి అగర్వాల్ ఓ ప్రత్యేక పాత్ర పోషించనుంది. ఈ చిత్రం ఘాటింగ్ హైద్రాబాద్‌లో శుక్రవారంనాడు ప్రారంభమైంది. మంచి కథాకథనాలతో ఈ చిత్రం చక్కటి ఎంటర్‌టైన్‌ర్‌గా రూపొందబోతోందనీ, తొలిసారి తాను పూర్తి స్క్రిప్టు అందుకుని ఈ చిత్రాన్ని చేస్తున్నాననీ హీరో వేణు తెలిపారు. ఈ చిత్రానికి దీపావళి అనే టైటిల్ అతికినట్టు సరిపోతుందని చెప్పారు. తెలుగులో ఇది తనకు తొలి సినిమా అనీ, ఈ చిత్రం ద్వారా తనకు మంచి కెరీర్ ఉంటుందనే నమ్మకంతో ఉన్నానీ హీరోయిన్ మేఘా నాయిర్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాతల్లో బ్రహ్మానందం, భానుచందర్, చలపతిరావు, ఆలీ తదితరులు నటిస్తున్నారు.
|
|