|
|
|
ఆకాష్ హీరోగా నటిస్తున్న ఎవరినైనా ఎదిరిస్తా చిత్రాన్ని బాలాజీ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి శశిప్రీతమ్ సంగీతాన్ని సమకూర్చారు. హీరోగా నటిస్తున్న మంద నరేందర్ ముదిరాజ్ మరో హీరోగాను నటిస్తున్న ఈ చిత్రంలో సింధు హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను మీడియా సెలెక్ట్ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీరంగ ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా ముందుగా బాలాజీ మాట్లాడుతూ శశిప్రీతమ్ బాణీలు ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయని చెప్పారు. హీరో ఆకాష్ కూడా వైవిధ్యమైన పాత్రను పోషించాడని, తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడని తెలిపారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఒక రొటీన్ లవ్ స్టోరీ అయినా డిఫెరెంట్‌గా ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నామన్నారు. ప్రేమ కోసం ఎంతటి వారినైనా ఎదిరిస్తే ఎలా ఉంటుందనేది ఈ కథ సారాంశం అని ఆయన చెప్పారు. నరేందర్ మాట్లాడుతూ ప్రస్తుతం తొలి కాపీ ఇప్పటికే పూర్తి అయిందన్నారు. అన్ని కార్యక్రమాలను ముగించుకుని ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరాను జగదీష్ షూట్ చేస్తుండగా, పాటలను సుద్దాల అశోక్ తేజ అందిస్తున్నారు
|
|