|
|
|
శ్రీజ పెళ్లి గోలకు ఒక్కసారి మాత్రం చిరంజీవి మీడియాలో స్పందించి ఆపై కనిపించలేదు. ఆయన ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ వెళారని అంటున్నారు ఫిలింనగర్‌లో. అమెరికానో, లండనో సరిగ్గా చెప్పకపోయినా హైదరాబాదులో అయితే లేరని అన్నారు. తాజా గాసిప్ ఏమిటంటే ఆయన సిటీలో లేరు గానీ, ఇంటియాలోనే వున్నారని. ప్రస్తుతం ఆయన బెంగుళూరులో సొంత రిసార్ట్స్‌లో వున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడకు ఆయన బై రోడ్ వెళ్లారని ఫిలింనగర్ గాసిప్ వర్గాలు అంటున్నాయి. కోర్టు కేసు ముగిసి పోవడం తో శ్రీజ ఇష్యూ చల్లబడిపోయింది ప్రస్తుతానికి. మరి మెగాస్టార్ ఊహాగానాల్లో వినిపిస్తోన్న ఊర్లలో ఎక్కడున్నారో? ఆయన మరోసారిం ఈడియా ముఖంగా తమను ఆశీర్వదించాలని కోరిన శ్రీజ కోర్కె తీరేనో లేదో చూడాలి. |
|