క్లీన్ షేవ్ తో రజని !
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

  రజనీకాంత్ ఇంట్లో ఉంటే ఎక్కువగా గడ్డంతోనే ఉంటాడు. ఏదైనా పూజ చేసినా కూడా అలానే కనిపిస్తాడు. కాకపోతే ఈ మధ్య క్లీన్ షేవ్ చేసుకోవాల్సి వస్తోందిట. కారణం... ముద్దుల మనవడు యాత్ర, అదేనండీ ఐశ్వర్య, ధనుష్‌ల కొడుకు! యాత్ర అంటే రజనీకి చాలా ముద్దు. ఖాళీగా ఉంటే ఐశ్వర్య ఇంటికి వెళ్లి యాత్రతో కాసేపు కాలక్షేపం చేసి వస్తుంటాడు రజనీ. ఓ రోజు రజనీ ముద్దు పెట్టుకుంటుంటే యాత్ర బుగ్గలకి గడ్డం గుచ్చుకుంది. అంతే, ఆ పిల్లాడు ఏడుపు మొదలు పెట్టాడు. ఎంత లాలించినా ఏడుపు అపలేదు. రోజంతా ఏడుస్తూనే ఉన్నాడట. దాంతో, మనవడి కష్టానికి కారణమైన గడ్డాన్ని తీసెయ్యాలని రజనీ డిసైడయిపోయాడు. ఆరోజు నుంచి ఐశ్వర్య ఇంటికి ఎప్పుడు వెళ్లినా క్లీన్ షేవ్ చెయ్యందే బయలు దేరడట రజనీ.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.